
వెంకటరమణ యాక్షన్ మొదలుపెట్టే డేట్ ఫిక్సయిందట. ఈ ఫైట్ అలిమేలు కోసమేనా? తెలియాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలిమేలు మంగ వెంకటరమణ’. ‘జయం, నిజం’ సినిమాల తర్వాత గోపీచంద్, తేజ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. అయితే ఆ చిత్రాల్లో విలన్‌గా నటించిన గోపీచంద్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 7న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవి నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment