టాలీవుడ్ విలక్షణ దర్శకుడు తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు.
అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు. దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్స్‌లో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment