
వెంకటేశ్ బర్త్‌డే సందర్భంగా హారిక హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. వెంకటేశ్ కెరీర్‌లో మంచి హిట్స్‌గా నిలిచిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు త్రివిక్రమ్ రాసినవే. రైటర్‌గా వెంకీకి హిట్స్ ఇచ్చిన త్రివిక్రమ్ ఇప్పుడు దర్శకుడిగా హిట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్ అంటే మనకు గుర్తొచ్చేది మంచి కుటుంబ కథలున్న సినిమాలు, కడుపుబ్బా నవ్వుకునే హాస్య సన్నివేశాలు.
త్రివిక్రమ్ సినిమాలో ఈ రెండూ కామన్. సో.. ఒక మంచి ఫ్యామిలీ ప్యాకేజీ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అన్నట్లు.. వెంకీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయడం ఇది రెండోసారి. ఆశ్చర్యంగా ఉందా? త్రివిక్రమ్–పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘అజ్ఞాతవాసి’లో అతిధి పాత్రలో మెరవనున్నారు వెంకీ. అసలు విషయం అది.