
సరికొత్త తేజం హోరాహోరీ
కొత్తవాళ్లతో ప్రేమకథ తీసి బాక్సాఫీస్‌ను గెలవడం తేజకు వెన్నతో పెట్టిన విద్య. అదే పంథాలో ఆయన చేసిన తాజా ప్రయత్నం - ‘హోరా హోరీ’. దిలీప్, దక్ష హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. కేఎల్ దామోదరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. కథ విని ఇంప్రెస్ అయిన అగ్రనిర్మాత డి. సురేశ్‌బాబు ఆఖరి నిమిషంలో ఈ చిత్రంలో భాగస్వామిగా చేరడం విశేషం.
ఊహించని మలుపులతో కూడిన కథాకథనం, ఆసక్తిదాయకమైన చిత్రీకరణతో ‘హోరాహోరీ’ నవతరం సినిమాకు సరికొత్త నిర్వచనం చెబుతుందని తేజ నమ్మకంగా చెబుతున్నారు. ఉదయ్‌కిరణ్, నితిన్, నవదీప్, సదా తదితరులతో పాటు ఎందరో కొత్త తారలకు జీవితాన్నిచ్చిన తేజ ఈ సినిమాతో కొత్త హీరో దిలీప్‌కు బ్రేక్‌నివ్వనున్నారు. ఈ సినిమాతో తేజ పూర్వవైభవం సాధించడం ఖాయమనే భావన పరిశ్రమలో నెలకొంది. తేజ కూడా ఈ సినిమా విషయంలో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు.