
తేజతో హోరాహోరీ నిజమే!
‘‘తేజ వర్కింగ్ స్టైల్ ఇబ్బంది అని పించింది. మా ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చిన మాట నిజమే. కానీ, టెక్నీషియన్స్‌తో ఎలా పని చేయించు కోవాలో తెలిసినవాడు. అవన్నీ గుర్తొ చ్చినప్పుడు తనతో మళ్లీ ఇంకో సినిమా చేయాలనిపిస్తుంది. కానీ, గొడవలు తలుచుకుంటే మాత్రం వద్దు అనిపిస్తుంది’’ అని సంగీత దర్శకుడు కల్యాణి కోడూరి చెప్పారు. దిలీప్, దక్ష జంటగా శ్రీరంజిత్ మూవీస్ పతాకంపై తేజ దర్శకత్వంలో కె.ఎల్. దామోదర ప్రసాద్ నిర్మించిన ‘హోరాహోరీ’కి ఆయన పాటలు స్వరపరిచారు.
త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి కళ్యాణి కోడూరి విలేకరులతో మాట్లా డుతూ - ‘‘ఇందులో పాటలు కొత్తగా ఉంటాయి. నాకు తెలిసినవారు, తెలియని వారు అందరూ ఫోన్ చేసి అభినందించారు. నేను మా అన్నయ్య కీరవాణి సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సహకరిస్తానని అంటూ ఉంటారు. కానీ అది బ్యాడ్ గాసిప్. కేవలం సౌండ్ సూపర్‌విజన్ చేస్తూ ఉంటా. నేను నేపథ్యసంగీతం ఇచ్చేంత దౌర్భాగ్యం అన్నయ్య కీరవాణికి పట్టలేదని నా ఫీలింగ్’’ అన్నారు.