ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’ | Dude Movie Latest Updates | Sakshi

ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథగా ‘డ్యూడ్’

Jun 7 2023 12:49 PM | Updated on Jun 7 2023 12:53 PM

Dude Movie Latest Updates - Sakshi

యంగ్‌ హీరో తేజ్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డ్యూడ్’. తెలుగు - కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పనరోమిక్ స్టూడియోస్ పతాకంపై తేజ్ స్వయంగా నిర్మిస్తుండడమే కాకుండా... స్వయంగా కథను అందించి, దర్శకత్వం వహిస్తుండడం విశేషం. తేజ్ ఇంతకుముందు ‘రామాచారి’ అనే హిట్ చిత్రంలో నటించారు. తను తాజాగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘గాడ్’ ప్రి - ప్రొడక్షన్ లో ఉంది.

ఇప్పటివరకు కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలు వచ్చాయి. కానీ పూర్తి ఫుట్ బాల్ నేపథ్యంలో ఇప్పటివరకు ఏ తెలుగు, కన్నడ భాషల్లో సినిమా రాలేదు. అందువల్లే... కర్ణాటకలోని ‘కిక్ స్టార్ట్’ అనే సుప్రసిద్ధ ఫుట్ బాల్ క్లబ్... ‘డ్యూడ్’ చిత్రానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది.

అక్టోబర్ లో సెట్స్ కు వెళ్లనున్న ఈ చిత్రానికి కన్నడ - మలయాళ భాషల్లో సుపరిచితుడైన ఇమిల్ మొహమ్మద్ సంగీతం సమకూర్చుతుండగా... నాని కెరీర్ కి తిరుగులేని పునాది వేసిన "అలా మొదలైంది" చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన ప్రేమ్ కెమెరా బాధ్యతలు నిర్వహించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement