‘తప్పు’ చేస్తున్నారు! | Director Teja Next Film Title 'Thappu' | Sakshi
Sakshi News home page

‘తప్పు’ చేస్తున్నారు!

Feb 25 2014 11:54 PM | Updated on Aug 11 2018 8:29 PM

‘తప్పు’ చేస్తున్నారు! - Sakshi

‘తప్పు’ చేస్తున్నారు!

అవును... తేజ ‘తప్పు’ చేస్తున్నారు. ఇక్కడ ‘తప్పు’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న కొత్త సినిమా టైటిల్ ‘తప్పు’.

 అవును... తేజ ‘తప్పు’ చేస్తున్నారు. ఇక్కడ ‘తప్పు’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న కొత్త సినిమా టైటిల్ ‘తప్పు’. అంతా కొత్తవాళ్లతో ఆయన ఈ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. చాలా విరామం తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘చిత్రం మూవీస్’లో తేజ ఈ సినిమా చేయబోతున్నారు. కల్యాణీ కోడూరి స్వరాలందిస్తున్నారు. పెద్దాడమూర్తి పాటలు రాస్తున్నారు. పక్కా యూత్‌ఫుల్ ఫిల్మ్‌గా తేజ దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ‘‘సమాజానికి కొన్ని సరిహద్దులుంటాయి. ఆ హద్దులతో చెలగాటమే ఈ సినిమా. అంతకుమించి వివరాలు చెప్పను’’ అని తేజ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement