
చైతన్య, తేజ, ధన్య బాలకృష్ణన్ కీలక పాత్రల్లో సునీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జగమేమాయ'. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు రెడీ అయింది. నేరుగా ఓటీటీలోనే ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా డిసెంబరు 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. తాజాగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ట్రైలర్ చూస్తే.. 'నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ సమాజంలో మనుషుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తారు? వంటి అంశాలను ‘జగమేమాయ సినిమాలో చాలా విలక్షణంగా ఆవిష్కరించినట్లు అర్థమవుతోంది. ముగ్గురు వ్యక్తుల మధ్య ఉన్న రిలేషన్‌పై డబ్బు ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment