
బంజారాహిల్స్‌లో ఉన్న స్థలాన్ని ఖాళీ చేయించినందుకు... అనే డైలాగ్‌తో ప్రారంభమవుతుంది ‘సీత’ సినిమా టీజర్. నువ్వు నాలా ఉన్న మగాడికి హెల్ప్ చెయ్ పెళ్లి చేసుకుని(సోనూసూద్)... ఈ పెళ్లి, పర్మనెంట్ అటాచ్‌మెంట్స్ నాకు వర్కవుట్ అవ్వదు(కాజల్), నువ్వు మట్టికొట్టుకుపోతావే.. నువ్వు సీతవికాదే సూర్పణఖవి, ఇంత కంత్రీ పిల్లకి ఆపేరు పెట్టారేమిటా అనుకున్నాను.. పక్కనే శ్రీరాముడు ఉన్నాడన్న సంగతి అర్థం కాలేదు నాకు(తనికెళ్ల భరణి), హలో సార్.. నా పేరు రఘురామ్.. సీతని నేను చూసుకోవాలి, సీత నన్నుచూసుకోవాలని మావయ్య చెప్పారు(సాయి శ్రీనివాస్)... వంటి డైలాగులు సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీత’. కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విజయవాడలోని వి.ఆర్.సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో రిలీజ్ చేశారు. ‘‘ఈ ఫంక్షన్‌లో బెల్లంకొండ, పాయల్ రాజ్‌పుత్ స్టన్నింగ్ డ్యాన్స్ పెర్ఫామెన్స్, అనూప్ రూబెన్స్ లైవ్ పెర్ఫామెన్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేయనున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ వేడుకలో తేజ, నిర్మాత అనీల్ సుంకర, కిషోర్ గరికపాటి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment