మే 24న రాబోతోన్న ‘సీత’ | Bellamkonda Sai Sreenivas And kajal Movie Sita Releasing On 24th MAy | Sakshi
Sakshi News home page

మే 24న రాబోతోన్న ‘సీత’

Published Sun, May 5 2019 3:04 PM | Last Updated on Sun, May 5 2019 3:04 PM

Bellamkonda Sai Sreenivas And kajal Movie Sita Releasing On 24th MAy - Sakshi

‘కవచం’ సినిమాతో రీసెంట్‌గా పలకరించిన బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆశించిన విజయం దక్కలేదు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచీ సరైన సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న ఈ యువహీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.  ఈ హీరో మరోసారి కాజల్‌ అగర్వాల్‌తో కలిసి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్‌లో రాబోతోన్న మరో చిత్రం ‘సీత’ రిలీజ్‌ డేట్‌ ఖరారైంది.

ఈపాటికే విడుదల కావల్సిన ఈ చిత్రాన్ని సరైన సమయం కోసం చూసి వేసవి చివర్లో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు మేకర్స్‌. మే 24న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సోనూసూద్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌ ఓ ప్రత్యేక గీతంలో నటించింది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మించంగా డైరెక్టర్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement