డై..లాగి కొడితే...
సినిమా : జయం
రచన, దర్శకత్వం: తేజ
వెంకటరమణ (నితిన్), సుజాత (సదా) ఒకే కాలేజీలో చేరతారు. కాళ్లకు పట్టీలు వేసుకొచ్చిందని సుజాతను ఏడిపిస్తాడు అలీబాబా (సుమన్ శెట్టి). ఆ కారణంతో మరుసటి రోజు రైల్వేస్టేషన్ వరకూ పట్టీలు వేసుకొచ్చిన సుజాత వాటిని తన చెల్లికి ఇచ్చి సాయంత్రం తీసుకురమ్మని కాలేజీకి వస్తుంది. అదేంటండి.. పట్టీలు తీసేశారని వెంకటరమణ అడుగుతాడు. అవును.. తీసేశాను. నీకెందుకు? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నావని మీరే ఏడిపిస్తారు.. తీసేస్తే.. ఎందుకు తీసేశారని మళ్లీ మీరే అడుగుతారు. వేసుకుంటే వేసుకుంటా.. తీసేయాలనిపిస్తే తీసేస్తా.. అసలు నా సంగతి నీకెందుకయ్యా.. నీకూ, నాకూ ఏంటి సంబంధం?
‘వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ...’
అంటుంది సుజాత. ఈ డైలాగ్ ఎంత పాపులర్ అంటే.. ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది.