
టాలీవుడ్ దర్శకుడికి కమల్ గ్రీన్‌సిగ్నల్
సినిమాను కొత్తపుంతలు తొక్కించిన నటుడు కమలహాసన్. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అవార్డులకే అలంకారంగా మారిన ఈ కళాపిపాసి కొత్తవారిని ప్రోత్సహిచడంలో ముందుంటారు. ప్రతిభను గుర్తించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ విషయంలో తనపర భేదమే చూపరు. అలాంటి విశ్వనాయకుడు తాజాగా టాలీవుడ్ దర్శకుడి చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఆ దర్శకుడెవరో కాదు చిన్న చిత్రాలతో పెద్ద విజయాలు సాధించిన తేజ. వీరిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతోంది. తేజ ఇంతకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చిత్రం చెయ్యాలని ప్రయత్నించారు.
ఆయన కోసం మంచి కథను కూడా సిద్ధం చేశారు. కారణమేమైన ఆ చిత్రం సెట్‌పైకి రాలేదు. కానీ ఇప్పుడు సకల కళావల్లభుడు కమలహాసన్‌తో చిత్రం ఖాయం అయినట్లు సమాచారం. ఈ చిత్రం డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నో రకాల పాత్రలకు జీవం పోసిన కమల్‌హాసన్ కోసం తాను కొత్తగా పాత్ర క్రియేట్ చేసే స్థాయిలో లేనని అందుకనే ఆయన మైండ్లో ఉన్న కథల్లో కొన్నింటి గురించి కమల్‌హాసన్‌తో చర్చించి ఒక కథను ఎంపిక చేసినట్లు దర్శకుడు తేజ వెల్లడించారు. ఇది ఆయన ఇంతకుముందు నటించిన నాయకన్, ఒరు ఖైదీ ఇన్ డైరీ చిత్రాల తరహాలో పలు ఆసక్తి కరమైన అంశాలతో కూడిన యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి కమల్‌హాసన్ స్క్రీన్‌ప్లే సిద్ధం చేస్త్తున్నారని తాను సంభాషణలు రాస్తున్నానని తేజ తెలిపినట్లు ఆంగ్ల పత్రికలో వార్తలు వెలువడుతున్నాయి.