
అల్లుడు శీనుగా వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పీడు పెంచాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సాయి శ్రీనివాస్ త్వరలో సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే సాక్ష్యం షూటింగ్ పూర్తి చేసిన సాయి శ్రీనివాస్ కొత్త దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన ఐదో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు సాయి శ్రీనివాస్. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాను ప్రారంభించనున్నారు.
సాయి శ్రీనివాస్ ఆరో చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా రేపు (సోమవారం) ఉదయం నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాలో సాయి శ్రీనివాస్‌కు జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ తదుపరి చిత్రలోనూ హీరోయిన్‌గా నటించనున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment