
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ పతాకంపై ‘జెమిని’ కిరణ్ నిర్మించనున్నారు. తాను హీరోగా పరిచయం కానున్న సినిమా పనులను షురూ చేశారు అభిరామ్. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ఆదివారం జరిగాయని తెలిసింది. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.ఆర్.పి పట్నాయక్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment