అదితికి కన్నీటి నివాళి | Tear tributes to Adithi | Sakshi
Sakshi News home page

అదితికి కన్నీటి నివాళి

Published Thu, Oct 1 2015 8:35 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

అదితికి కన్నీటి నివాళి - Sakshi

అదితికి కన్నీటి నివాళి

తడబడిన అడుగును
కడలి మింగేసింది.
ఆడుతూ పాడుతూ
ఆడాల్సిన ఆరేళ్ల పసికూన  
మురికి కాల్వలో అల్లాడితే
తల్లడిల్లిన తల్లిపేగు
పొగిలి పొగిలి ఏడ్చింది
ఆచూకి దొరకని ఏడు రోజులు
ఏడు యుగాలు...
చావు కబురును ఒడ్డుకు చేర్చిన అలలు
మౌనంగా వెనక్కి వెళ్లిపోయాయి
ఇసుకలో నిర్జీవంగా..
గుర్తుపట్టడానికి తల్లి మనసుకి
 ఆనవాళ్లు కావాలా!
తప్పు ఎవరిదైనా
అందని తీరాలకు అదితి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement