అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత | adithi mother and grand father got illness | Sakshi
Sakshi News home page

అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత

Oct 1 2015 9:46 PM | Updated on May 3 2018 3:17 PM

అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత - Sakshi

అదితి తల్లి, తాతయ్యలకు స్వల్ప అస్వస్థత

ఆరేళ్ల అదితి మరణవార్త వినగానే చిన్నారి తల్లి, తాతయ్యలు అస్వస్థతకు గురయ్యారు.

విజయనగరం : ఆరేళ్ల అదితి మరణవార్త వినగానే చిన్నారి తల్లి, తాతయ్యలు అస్వస్థతకు గురయ్యారు. విజయనగరం జిల్లా భోగాపురం సన్రే బీచ్లో లభ్యమైన చిన్నారి మృతదేహాన్ని తమ కూతురు అదితి అని తండ్రి గుర్తించడంతో వారం రోజుల పాటు చేపట్టిన గాలింపు చర్యలకు తెరపడింది. అయితే కూతురి మృతదేహాన్ని గుర్తించిన వెంటనే తండ్రి శ్రీనివాసరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పాప కుటుంబసభ్యులు ఇప్పటికీ ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అనంతరం అధికారులు అదితి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. చిన్నారి అదితి మరణవార్త తెలియగానే.. పాప తల్లి, తాతయ్యలు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement