
గాయపడిన భానుమతి
భామిని: వరకట్న వేధింపులు చేస్తూ భార్యను ఇంట్లో నుంచి ఈడ్చికొచ్చి భర్త దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సోమవారం మండలంలోని సొలికిరి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొత్తకోట భానుమతికి వెంకటరమణకు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు సాయి (22) ఉన్నాడు. ఈ నేపథ్యంలో పుట్టింటి నుంచి వరకట్నం పేరున భూములు రాయించుకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. ఈమెతోపాటు అడ్డుకున్న కుమారుడికి గాయాలయ్యాయి. వీరిని కొత్తూరు ఆసుపత్రికి తరలించారు. భార్యను వదిలించుకోవాలనే వరకట్నం పేరున వేధిస్తున్నట్లు బత్తిలి ఎస్సై అజార్‌అహ్మద్‌కు గ్రామస్తులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.