
పెళ్లినాటి ఫొటో (ఫైల్)
గచ్చిబౌలి: కట్టుకున్న భర్త, అత్త వేధింపుల కారణంగానే తన కూతురు పెళ్‌లైన 76 రోజుల్లోనే ఆత్మహత్య చేసుకుందని ఖమ్మం జిల్లాకు చెందిన అయ్యదేవర వెంకట రమణ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వివరాలు.. కొండాపూర్‌లోని సుబ్బ య్య అర్చిడ్స్‌లో శేష సంతోషిణి బుధవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి తన కూతురు ఆత్మహత్యకు ఆమె భర్త, అత్త మామలే కారణమని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురువారం గచ్చిబౌలి స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గత ఫిబ్రవరి 15న తన కూతురు శేష సంతోషిణి కుమారిని పాతర్లపాడు, సూర్యపేట జిల్లాకు చెందిన పాండురంగారావుతో వివాహం జరిపించామని తెలిపారు. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని రోదించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు సూసైడ్ నోట్ నా చిన్న కూతురు వాట్సాప్‌కు పంపిందని, ఫోన్ చేసినా అల్లుడు స్పందించలేదన్నారు. రాత్రి 7 గంటలకు తన కూతురు చనిపోయిందన్న సమాచారం వచ్చిందని తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment