అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడింది.
కేతెపల్లి: అత్తింటి వేధింపులు తాళలేక నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేతెపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కళ్యాణి(21)కి ఏడాది కిందట మిర్యాలగూడకు చెందిన యువకుడితో వివాహమైంది.
అప్పటి నుంచి అదనపు కట్నం తేవాలని అత్తింటి వారు ఆమెను వేధిస్తుండటంతో.. కొన్ని రోజుల క్రితం తల్లిగారింటికి వచ్చిన కళ్యాణి శనివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ అంశంపై ఇంతకు ముందే పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకపోయిందని.. తమ కూతురు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.