సవిత(ఫైల్) భర్త బాళేగౌడ
రాయచూరు రూరల్ : వరకట్నం తీసుకు రావాలని భర్త, కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెడుతుండడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాలూకాలోని దేవసూగూరులో సంభవించింది. మార్చి 31 2018న దేవసూ గూరుకు చెందిన కాంట్రాక్టర్ జంబణ్ణ కుమారు డు బాళేగౌడతో యాదగిరి జిల్లా శహాపుర తాలూకా మళ లి గ్రామానికి చెందిన బసవలింగప్ప కూతురు సవిత(18)కు వివాహమైంది. వివాహ సమయంలో 5 తులాల బంగారాన్ని వరకట్నంగా ఇచ్చారు.
అయితే మరింత బంగారం తేవాలని భర్త కుటుంబ సభ్యులు నిత్యం వేధించడమేగాకుండా వరకట్నం తేకపోతే బాళేగౌడకు రెండో పెళ్లి చేస్తామని బెదిరించారు. దీం తో వేధింపులు తాళలేక సవిత గురువారం రాత్రి ఇం టిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విష యంపై శక్తినగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment