కర్ణాటక, బనశంకరి: ఓ మాజీ మంత్రి భారీమొత్తంలో రుణం తీసుకుని చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బెంగళూరులోని చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధి లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు... చంద్రాలేఔట్‌కు చెందిన అంజనా వి. శాంతవేరి (35) అనే మహిళ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన మాజీ మంత్రి బాబు రావ్ చించనసూర్ రూ.11.88 కోట్లు రుణం గా తీసుకున్నారు. ఆ తరువాత అప్పు చెల్లించలేదు. దీంతో అంజన మాజీ మంత్రి పై కోర్టులో కేసు వేశారు.
ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ తరుణంలో మరోవైపు అంజనాకు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిడి అధికమైంది. తమ వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని ఆమెను డిమాండ్ చేయసాగారు. ఒకవైపు తాను ఇచ్చిన డబ్బులు రాకపోవడం, మరోవైపు ఒత్తిళ్లతో జీవితం మీద విరక్తి చెందిన అంజన చంద్రాలేఔట్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె కుమారునికి ఫోన్ చేసి తన మృదేహానికి నువ్వే నిప్పు పెట్టాలని చెప్పినట్లు తెలిసింది. ఈ ఘటన పై చంద్రాలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బాబురావ్ స్వస్థలం కలబుర్గి జిల్లా చించోళి. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment