
సాక్షి,బెంగళూరు (బెళగావి): భార్య అదనపు కట్నం తేలేదనే కారణంగా భర్త తన తల్లితో కలసి ఏడాది వయసున్న కుమారుడిని హత్య చేసిన ఘటన మంగళవారం బెళగావిలోని హక్కురే తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కోటబాగి గ్రామానికి చెందిన నామదేవ అనే వ్యక్తికి దాండేలికి చెందిన యువతితో కొద్ది సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహమైన కొద్ది నెలలకే భర్త, అతడి తల్లి అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించసాగాడు. మంగళవారం గొడవ జరిగి నామదేవ, అతడి తల్లి మహిళను బలవంతంగా బయటకు నెట్టి ఏడాది వయసున్న కొడుకు జోయల్‌కు పురుగుల మందు తాగించడంతో బాలుడు అక్కడే మృతి చెందాడు. మహిళ ఫిర్యాదు మేరకు హుక్కేరి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.