
యశవంతపుర : అదనపు కట్నం తీసుకురావాలని తనను తన భర్త వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య సోమవారం బెంగళూరు కోడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. 2017లో కొరియోగ్రాఫర్ వరదరాజన్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో ఇంటి స్థలంతో పాటు బంగారు అభరణాలు, నగదును కట్నంగా ఇచ్చారు. అయితే భర్త వరదరాజన్ డ్యాన్స్ అకాడమీని స్థాపించాలని, దానికి కావాల్సిన డబ్బులు తీసుకురావాలని వేధిస్తున్నట్లు రమ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను హింసిస్తున్నాడని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment