తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత అమలాపురం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వేధింపుల్లో భాగంగా భార్య చేత భర్త తన మూత్రం, వీర్యం తాగించాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి∙ఆమె భర్త రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన సీఐ వెల్లడించిన వివరాలిలా.. అమలాపురం సూర్య బలిజవీధికి చెందిన సౌజన్యకు, రాజమహేంద్రవరానికి చెందిన కోటిపల్లి దేవీ రమణకుమార్‌కు 2014లో వివాహమైంది. ఆ సమయంలో రూ.ఆరు లక్షలు కట్నంగా ఇచ్చారు. మరో రూ.ఐదు లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సౌజన్య ఫిర్యాదు చేసింది. తనను ఎంత దారుణంగా భర్త వేధిస్తున్నాడో ఆమె తన ఫిర్యాదులో వివరించిందని సీఐ చెప్పారు. కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేసినప్పుడు దారుణమైన వేధింపులకు దిగినట్టు తేలిందని సీఐ వివరించారు. అంతేకాకుండా సౌజన్య మేనత్త పేరున ఆస్తిని తన పేరున రాయించాలని కూడా వేధిస్తూ చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో భర్త దేవి రమణకుమార్, మామ సుబ్బారావులను గురువారం రాత్రి అరెస్ట్ చేశామన్నారు. కేసులో అత్త ధనలక్ష్మిని అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఆమె పరారీలో ఉందని సీఐ శ్రీరామ కోటేశ్వరరావు తెలిపారు.
మరో వివాహిత పోలీసుల వద్దకు..
భర్త, అత్తమామలు, ఆడపడుచు, ఆమె భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ అమలాపురం పట్టణం నల్లవంతెన ప్రాంతానికి చెందిన కొల్లాటి రాజేశ్వరి పట్టణ పోలీసుకు ఫిర్యాదు చేసింది. అమలాపురానికి చెందిన తనకు, ముమ్మిడివరానికి చెందిన కొల్లాటి రాజేష్‌తో 2007అక్టోబర్ 28న పెద్దల సమక్షంలో వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం వల్ల అక్కడే కాపురం ఉంటున్నామని, తమతో పాటు మామ బాబూరావు, అత్త అమరావతి కూడా ఉంటున్నారని తెలిపింది. తమ ఇంటికి సమీపంలోనే ఆడపడుచు దేవి, ఆమె భర్త పున్నారావు కుటుంబం ఉంటోందని, పెళ్లి సమయంలో రూ.ఆరు లక్షల నగదు, 20 కాపుల బంగారు నగలు కట్నంగా ఇవ్వగా, అదనపు కట్నం తీసుకురావాలని తనను వేధిస్తున్నారని సీఐ రామకోటేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment