
భర్త మల్లికార్జున్‌తో శాంత (ఫైల్)
అనంతపురం, దొడ్డబళ్లాపురం : అనంతపురం జిల్లా పేరూరుకు చెందిన ఆంజనేయులు, ఆదెమ్మ దంపతుల కుమార్తె శాంత (26) వరకట్న వేధింపులకు బలైంది. వివరాలిలా ఉన్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మల్లికార్జున్‌తో శాంతకు వివాహం జరిగింది. ఆనాటి నుంచి మల్లికార్జున్ శాంతను అదననపు కట్నం కోసం వేధించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కొన్నాళ్లక్రితం మల్లికార్జున్ భార్యతో కలిసి కర్ణాటకలోని దొడ్డబళ్లాపురం వలస వచ్చి శ్రీనగర్‌లో నివసించేవాడు. ఇక్కడ కూడా కట్నం కోసం గొడవపడేవాడని, ఈ క్రమంలో శాంతను కొట్టి హత్య చేసి ఇంట్లో ఉరివేసుకున్నట్టు చిత్రీకరించాడని, ఒంటిమీద గాయాలున్నాయని మృతురాలి తల్లి ఆదెమ్మ ఆరోపించింది. దొడ్డ పట్టణ పోలీసులు మల్లికార్జున్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment