వివరాలు సేకరిస్తున్న సీఐ నాయక్, రజక సంఘ జిల్లా అధ్యక్షుడు కట్లయ్య
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన తిమ్మాపు రం పంచాయితీ లక్ష్మీపురం కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామానికి చెందిన దుర్గ (29)కు, ద్వారకాతిరుమలకు చెందిన తొంటపాక సత్యనారాయణతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి సం తానం లేదు. దుర్గ తీసుకొచ్చిన కట్నం సొమ్ములను భర్త, అతని కుటుంబ సభ్యులు వాడుకుని దుర్గను బయటకు గెంటేశారు. ఈక్రమంలో జరి గిన గొడవల నేపథ్యంలో సత్యనారాయణ భార్య దుర్గతో కలిసి లక్ష్మీపురం కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయినా భర్త, అతని కు టుంబ సభ్యుల నుంచి ఆమెకు వేధింపులు తప్పలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన దుర్గ ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భర్త సత్యనారాయణ సమాచారం మేరకు భీమడోలు సీఐ బీఎన్ నాయక్, ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త వేధింపులు తాళలేకపోతున్నానని మృతురాలు దుర్గ రాసుకున్న డైరీని వారు స్వాధీనం చేసుకున్నారు. భర్త, అతని కుటుంబసభ్యులు పది మందిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వీర్రాజు చెప్పారు. ఈ ఘటనపై జిల్లా రజక సంఘ అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్య ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వచ్చి సీఐ నాగేశ్వర్‌నాయక్, ఎస్సై వీర్రాజు, మృతురాలి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment