లక్ష్మీపురం(గుంటూరు): వెస్ట్రన్ కల్చర్ పేరుతో వేధింపులకు గురి చేసిన తన కుమార్తెను అల్లుడు వదిలేశాడని, తన కుమారుడిపై పుట్టింటికి వెళ్లిపోయిన ఏడాదిన్నర తర్వాత కోడలు వరకట్నం వేధింపులు కేసు పెట్టిందని, తమకు న్యాయం చేయాలంటూ గుంటూరు నగరంలోని బ్రాడీపేటకు చెందిన సూర్యప్రకాష్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం గ్రీవెన్స్‌లో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావుకు తమ గోడును విన్నవించారు. సూర్యప్రకాష్ దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్, అమ్మాయి సాహిత్యలు ఉన్నారు. కుమార్తెకు 2014 జూన్ 14న విజయవాడకు చెందిన రాము, సరళల దంపతుల కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిపించారు.
ప్రవీణ్ వెస్ట్రన్ కల్చర్ ప్రకారం జీవనం సాగిద్దామని చెప్పి నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించే వాడు. సాహిత్య గర్భవతి అయితే ఆమె అత్త అప్పుడే పిల్లులు వద్దని గొడవ చేసేదని, ఈ క్రమంలోనే ఆరు నెలల గర్భవతి అయిన కుమార్తెకు అత్తింట్లోనే శ్రీమంతం చేసి గుంటూరుకి తీసుకొచ్చినప్పటి నుంచి అల్లుడు పట్టించుకోవడం మానేశాడు. కొంత కాలానికి సాహిత్యకు బాబు పుట్టాడు. ఈ క్రమంలో పెద్దల ఒప్పందం ప్రకారం ప్రవీణ్ సాహిత్యను హైదరాబాద్‌కు తీసుకు వెళ్లి కాపురం పెట్టాడు. 2017 నవంబర్‌లో సాహిత్య రెండో సారి గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కడుపు పై కొట్టడంతో గర్భం పొయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో డిసెంబర్ 18న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించారు.
అమెరికా ఎలా వెళ్లాడు..
ప్రవీణ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. కేసు పూర్తికాక ముందే రిమాండ్‌లో ఉండి వచ్చిన వ్యక్తిని ఎలా అమెరికాకు వెళ్లేందుకు అనుమతించారంటూ సాహిత్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అల్లుడు ప్రవీణ్ మేనమామ త్రీనాథ్ టీడీపీ నాయకుల సాయంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని న్యాయం చేయాలంటూ ఎస్పీకి విన్నవించారు.
‘గే’తో స్నేహంతో..
అయితే అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్‌లో తుమ్మల సురేష్ అనే గే తో కలిసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు పదేళ్లుగా కలిసి ఉంటంతో ప్రవీణ్ భార్యను వదిలేశాడు. ఈ క్రమంలోనే సాహిత్యకు గే సురేష్ అసభ్య మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో ఓ సారి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
మరో వైపు కోడలితో గొడవ..
2016 మార్చిలో సూర్యప్రకాష్ దంపతులు కుమారుడు శ్రావణ్‌కు పోన్నురుకు చెందిన యువతితో వివాహం అయింది. కోడలు కూడా వివాహం అయినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేది. కొన్నాళ్లు పుట్టింటికి పంపించారు. మళ్లీ తిరిగి రాలేదు. ఏడాదిన్నర ఆమె భర్త, అత్త మామలపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment