Western culture
-
సహజీవనం పేరుతో సీజన్కొక భాగస్వామి. ఇదేం పధ్ధతి?
లక్నో: సహజీవనం పేరిట పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేసి భారత సంస్కృతిని వివాహ వ్యవస్థను నాశనం చేస్తోందని వ్యాఖ్యానించింది అలహాబాద్ హైకోర్టు. ఈ సందర్బంగా సీజన్ల వారీగా భాగస్వాములను మార్చుకుంటూ పోవడం ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదని తెలిపింది కోర్టు. అన్నీ అయిపోయాక.. అలహాబాద్‌లో అద్నాన్ అనే ఓ వ్యక్తి పరస్పర అంగీకారంతో యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన ఓ యువతితో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ యువతి అనూహ్యంగా గర్భం దాల్చడంతో అద్నాన్ పెళ్ళికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించగా విచారణ సమయంలో అలహాబాద్ కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంత సులువు కాదు.. ఒక వ్యక్తికి వివాహ వ్యవస్థ కల్పించినంత భద్రత కానీ సామాజిక అంగీకారం కానీ సహజీవనం కల్పించలేదని తెలిపారు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిద్ధార్థ్. దీర్ఘకాలిక పరిణామాలపైఅవగాహనలేక యువత ఇలాంటి తప్పటడుగు వేస్తోంది. వివాహ వ్యవస్థ మనుగడలో లేని దేశాల్లో సహజీవనం సర్వసాధారణంగా మారిపోయింది కానీ ఇపుడు వారు ఈ సమస్య నుండి బయటపడి వివాహ వ్యవస్థను కాపాడటానికి నానా అవస్థలు పడుతున్నాయని అన్నారు. అయినా సీజన్ల వారీగా భాగస్వామిని మార్చడం సమాజపురోగతికి చేటు అని తెలిపారు. ఇది కూడా చదవండి: దీప్తిది హత్యే! కొలిక్కి వచ్చిన కోరుట్ల టెక్కీ కేసు -
విదేశీ యువతులు.. తెలుగింటి కోడళ్లు..
ఆదిలాబాద్: పెళ్లంటే ఒకప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాల చరిత్రను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. క్రమంగా ఆ సంప్రదాయానికి కాలం చెల్లుతోంది. ఉన్నత చదువుల కోసం, వృత్తిరీత్యా స్థిరపడేందుకు విదేశాల బాట పడుతున్న యువత అక్కడే తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రేమించి.. ఇరువైపులా పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొస్తున్నారు. ఇక్కడి అబ్బాయిలను ఇష్టపడుతున్న విదేశీ యువతులు భారతీయ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకొని మెట్టినింట్లో అడుగు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలుగింటి కోడళ్లుగా అడుగు పెట్టిన విదేశీ అమ్మాయిలపై ప్రత్యేక కథనం. ►అమెరికా అమ్మాయి.. ఆదిలాబాద్ అబ్బాయి.. (టేలర్ డయానా – అభినయ్‌రెడ్డి) ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు అమెరికాకు చెందిన యువతిని ప్రేమించి గత అక్టోబర్‌లో పెద్దల అంగీకారంతో మనువాడాడు. హిందూ సంప్రదాయాలకు అనుగుణంగా బంధుమిత్రుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఏడడుగులు కలిసి నడిచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దేవీదాస్– కళావతి దంపతుల పెద్ద కుమారుడు అభినయ్‌రెడ్డి, అమెరికాకు చెందిన టేలర్ డయానా ప్రేమించుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేశారు. వారి అంగీకారంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లో ఆదిలాబాద్ అబ్బాయి, అమెరికా అమ్మాయికి చెందిన ఇరుకుటుంబాల పెద్దలు, కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. వధువు తల్లిదండ్రులు, బంధువులు కూడా హాజరై ఆశీర్వదించారు. హిందూ సంప్రదాయాలు, సంస్కృతితో పాటు భారతీయ వంటకాలు చాలా ఇష్టమని వారు చెప్పడం గమనార్హం. వధూవరులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ►ఆస్ట్రేలియా అమ్మాయి.. నిర్మల్ అబ్బాయి.. (హనా,ఆస్ట్రేలియా – నామని కార్తీక్) ఆస్ట్రేలియాకు చెందిన ఓ అమ్మాయి నిర్మల్ అబ్బాయితో ప్రేమలో పడింది. అక్కడితో ఆగిపోలేదు.. చక్కగా ఆ అబ్బాయిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడి, నిర్మల్‌లో తెలుగింటి కోడలిగా అడుగుపెట్టింది. నిర్మల్ శాస్త్రినగర్ కాలనీకి చెందిన నామని పద్మ– సదానందం దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ హనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కార్తీక్ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తుండగా, అమ్మాయి హనా అక్కడే మెడ్ల్యాబ్లో సైంటిస్టుగా పనిచేస్తోంది. వీరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించారు. ఆగస్టు 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈ మహోత్సవానికి వధువు తల్లిదండ్రులు వెరోనికా–డార్రెన్ దంపతులు సైతం హాజరై హిందూ సంప్రదాయరీతిలో పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని టౌన్స్ ప్రిన్సిల్యాండ్స్లోకొత్తకాపురం మొదలుపెట్టారు. ►మయన్మార్ అమ్మాయి.. గుడిహత్నూర్ అబ్బాయి.. (కేథరీన్ – గొల్లపల్లి రవికుమార్) మయన్మార్ అమ్మాయి, గుడిహత్నూర్ అబ్బాయి ప్రేమకు ఎల్లలు లేవని నిరూపించారు. గుడిహత్నూర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికుమార్‌కు, మయన్మార్‌కు చెందిన కేథరీన్ ప్రేమించుకున్నారు. రవికుమార్ ఆరేళ్ల క్రితం ఖాతర్ దేశానికి వెళ్లాడు.. మయన్మార్‌లోని జిన్న్వేథేన్ నగరంలో ఓ హోటల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. వీరి ప్రేమకు పెద్దలు కూడా ఆమోదం తెలిపారు. చింతగూడలో సెయింట్ థామస్ చర్చిలో గత ఫిబ్రవరి 6న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. ఈ పెళ్లికి అమ్మాయి సోదరుడు క్యాహు థియేన్ హాజరుకాగా, వరుడి తరఫున కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరై ఆశీస్సులు అందజేశారు. -
వారి కోసం చైనా ఏం చేస్తోందంటే..
అమ్మ గర్భంలో ఉన్నపుడు... విదేశీ భాష వినడం నాలుగేళ్ల వయసులో.. బైలింగ్వల్ ఇంటర్నేషనల్ స్కూళ్లో చేరిక ఆరో ఏడు వచ్చే నాటికి... హ్యారీ పోటర్ నవలల అవపోసన ఎనిమిదో పుట్టినరోజు వేళకి... ప్రఖ్యాత ఐఈఎల్‌టీస్ స్కోర్ 7 ఇదీ చైనాకు చెందిన ‘నియువా’ అదే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సూపర్ టాలెంట్ కిడ్ తొమ్మిదేళ్ల ‘బాబీ జో’ ఆల్‌టైమ్ ట్రాక్ రికార్డు. ఇవేకాదు రెండో ప్రపంచ యుద్ధం గురించిన పూర్తి అవగాహన అతడి సొంతం. ఎంతో కఠిన పదాలతో కూడిన పుస్తకాన్నైనా సరే కేవలం గంటన్నరలో పూర్తి చేయడం బాబీ ప్రతిభకు నిదర్శనం. చైనాలోని ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా బాబీ లాగే నియువా కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం ఉద్యోగాలను సైతం వదిలి సూపర్ టాలెంటెడ్ కిడ్‌లను ‘ఉత్పత్తి’ చేసే ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే ఒక్క చాన్స్‌కోసం ఎదురుచూస్తున్నారు. ఆ అవకాశమే గనుక దక్కితే తమ బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు పడినట్లేనని భావిస్తున్నారే తప్ప... కేరింతలతో గడవాల్సిన తమ చిన్నారుల బాల్యం ఛిద్రమైపోతుందని గుర్తించలేకపోతున్నారు. ప్రపంచమే కుగ్రామమైన నేటి యుగంలో నెగ్గుకురావాలంటే ఈ మాత్రం కఠినంగా ఉండక తప్పదంటూ తమ చర్యలను సమర్థించుకుంటున్నారు కూడా. చైనాలోని విదేశీయుల పిల్లల కోసం.. ప్రస్తుతం నియువాల ఉత్పత్తి కోసం చైనాలో పెద్ద యఙ్ఞమే జరుగుతోంది. ఒకప్పుడు... చైనాలో నివసించే విదేశీయుల పిల్లల కోసం స్థాపించిన బైలింగ్వల్ ఇంటర్నేషనల్ స్కూళ్లపై చైనీయులు మోజు పెంచుకుంటున్నారు. అందుకే బీజింగ్, షాంఘై, షెంజన్ వంటి ప్రధాన నగరాల్లో ఈ స్కూళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. న్యూస్కూల్ ఇన్సైట్ అనే బీజింగ్ సర్వే సంస్థ ప్రకారం 2015-17 మధ్య బైలింగ్వల్ ఇంటర్నేషనల్ సంఖ్య సుమారు 30 శాతం పెరిగిందంటే.. వీటి ప్రభావం చైనీయులపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు అక్కడ ఏం నేర్పుతారు? బైలింగ్వల్ ఇంటర్నేషనల్ స్కూళ్లలో మొత్తం విదేశీ టీచర్లే ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చెందిన వారే ఉంటారు. ప్రతిరోజూ ఇంగ్లీష్ భాషలో డిబేట్లు నిర్వహించడం వారి ముఖ్యవిధి. దీనితో పాటుగా ఆర్ట్స్, సైన్స్, ఫిలాసఫీకి సంబంధించిన ముఖ్య విషయాలు బోధిస్తారు. అంతేకాదు సంగీతం, కరాటే, క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వారిని మెరికల్లా తీర్చిదిద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారు. వీటితో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో(పాశ్చాత్య సంస్కృతి)నూ తమదైన ముద్ర వేసేందుకు వారిని సిద్ధం చేస్తారు. ఈ విషయంలో పిల్లల వయసుతో వాళ్లకు సంబంధం ఉండదు. ఏడాదిన్నర చిన్నారి మొదలు ఐదేళ్ల బాలబాలికలు వారికి సమానమే. టీచర్లు ఇంత నిబద్ధతతో పని చేస్తారు కాబట్టే.. అందుకే తమ టార్గెట్‌ను పూర్తి చేసే విషయంలో ఈ అంతర్జాతీయ బడులు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. ఈస్ట్ మీట్స్ వెస్ట్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్టును పక్కాగా అమలు చేయడంలో విజయం సాధిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాల్లో చదవాలిగా..! ‘మా పిల్లలకి భిన్న సంస్కృతులు అలవడాలి. వారి ప్రతిభ కేవలం చైనాకే పరిమితం కాకూడదంటే కచ్చితంగా ఇంగ్లీషుపై పట్టు సాధించాల్సిందే. అకడమిక్ ర్యాంకులతో పాటు అంతర్జాతీయ అంశాలను అర్థం చేసుకునే విద్య కూడా ముఖ్యం. అందుకే ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారని పేర్కొన్నారు దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన సామాజిక వేత్త డాక్టర్ హన్నా సూంగ్. తమ పిల్లలు అమెరికా, ఆస్ట్రేలియాలకు చెందిన ప్రఖ్యాత యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే బైలింగ్వల్ స్కూళ్లే దిక్కు అనే భావనలో వారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ఏడాదికి సుమారు 30 వేల డాలర్ల ట్యూషన్ ఫీజుతో పాటుగా ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్ కోసం వందలాది డాలర్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. తప్పదంతే..! ‘పిల్లలకు మంచి భవిష్యత్తు అందించాలనుకోవడంలో తప్పులేదు కానీ అది వారి బాల్యాన్ని చిదిమేసేలా ఉండకూడదు. బాల్యం నుంచే తమ చిన్నారులు అసాధారణ ప్రతిభ కనబరచాలని కోరుకుంటున్న తల్లిదండ్రులు.. ఒక్కసారైనా వారి మానసిక పరిస్థితి గురించి ఆలోచించాలి. తమ పిల్లలు పాశ్చాత్య సంస్కృతికి అలవడాలనే ఈ విపరీత ధోరణి వల్ల చైనా సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉందని’ సంప్రదాయవాదులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడితే బయటి ప్రపంచంలో బతకడం కష్టమని వాదిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయినా ఇది కేవలం చైనా ఒక్క దేశానికే పరిమితమైన సమస్య కాదు కదా అని కొట్టిపారేస్తున్నారు. అవును ఇది కూడా వాస్తవమే కదా! మన దేశంలో కూడా పరిస్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదుగా.. ఏమంటారు!? -
వెస్ట్రన్ కల్చర్ పేరుతో భార్యను వదిలేసిన ప్రబుద్ధుడు
లక్ష్మీపురం(గుంటూరు): వెస్ట్రన్ కల్చర్ పేరుతో వేధింపులకు గురి చేసిన తన కుమార్తెను అల్లుడు వదిలేశాడని, తన కుమారుడిపై పుట్టింటికి వెళ్లిపోయిన ఏడాదిన్నర తర్వాత కోడలు వరకట్నం వేధింపులు కేసు పెట్టిందని, తమకు న్యాయం చేయాలంటూ గుంటూరు నగరంలోని బ్రాడీపేటకు చెందిన సూర్యప్రకాష్ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం గ్రీవెన్స్‌లో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయరావుకు తమ గోడును విన్నవించారు. సూర్యప్రకాష్ దంపతులకు కుమారుడు శ్రావణ్‌కుమార్, అమ్మాయి సాహిత్యలు ఉన్నారు. కుమార్తెకు 2014 జూన్ 14న విజయవాడకు చెందిన రాము, సరళల దంపతుల కుమారుడు ప్రవీణ్‌తో వివాహం జరిపించారు. ప్రవీణ్ వెస్ట్రన్ కల్చర్ ప్రకారం జీవనం సాగిద్దామని చెప్పి నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించే వాడు. సాహిత్య గర్భవతి అయితే ఆమె అత్త అప్పుడే పిల్లులు వద్దని గొడవ చేసేదని, ఈ క్రమంలోనే ఆరు నెలల గర్భవతి అయిన కుమార్తెకు అత్తింట్లోనే శ్రీమంతం చేసి గుంటూరుకి తీసుకొచ్చినప్పటి నుంచి అల్లుడు పట్టించుకోవడం మానేశాడు. కొంత కాలానికి సాహిత్యకు బాబు పుట్టాడు. ఈ క్రమంలో పెద్దల ఒప్పందం ప్రకారం ప్రవీణ్ సాహిత్యను హైదరాబాద్‌కు తీసుకు వెళ్లి కాపురం పెట్టాడు. 2017 నవంబర్‌లో సాహిత్య రెండో సారి గర్భవతి అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త కడుపు పై కొట్టడంతో గర్భం పొయింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో డిసెంబర్ 18న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించారు. అమెరికా ఎలా వెళ్లాడు.. ప్రవీణ్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. కేసు పూర్తికాక ముందే రిమాండ్‌లో ఉండి వచ్చిన వ్యక్తిని ఎలా అమెరికాకు వెళ్లేందుకు అనుమతించారంటూ సాహిత్య తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తమ అల్లుడు ప్రవీణ్ మేనమామ త్రీనాథ్ టీడీపీ నాయకుల సాయంతో కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని న్యాయం చేయాలంటూ ఎస్పీకి విన్నవించారు. ‘గే’తో స్నేహంతో.. అయితే అల్లుడు ప్రవీణ్ హైదరాబాద్‌లో తుమ్మల సురేష్ అనే గే తో కలిసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు పదేళ్లుగా కలిసి ఉంటంతో ప్రవీణ్ భార్యను వదిలేశాడు. ఈ క్రమంలోనే సాహిత్యకు గే సురేష్ అసభ్య మెసేజ్‌లు పంపేవాడు. ఈ క్రమంలో ఓ సారి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మరో వైపు కోడలితో గొడవ.. 2016 మార్చిలో సూర్యప్రకాష్ దంపతులు కుమారుడు శ్రావణ్‌కు పోన్నురుకు చెందిన యువతితో వివాహం అయింది. కోడలు కూడా వివాహం అయినప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడకుండా ఉండేది. కొన్నాళ్లు పుట్టింటికి పంపించారు. మళ్లీ తిరిగి రాలేదు. ఏడాదిన్నర ఆమె భర్త, అత్త మామలపై వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. -
పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడొద్దు
ఆలేరు : యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడవద్దని తెలంగాణ ధర్మ ప్రసారక్ సహ ప్రముఖ్ డీఎస్ మూర్తి, శ్రీశ్రీశ్రీ త్రిశూల్స్వామిజీ అన్నారు. ఆలేరులోని ఎస్సీ వాడలో విశ్వ హిందూ పరిషత్ ఆలేరు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాముహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతీయ సంస్కృతి గొప్పదని, హిందూ అంటే ఒక ధర్మం, జీవన విధానం అని చెప్పారు. అన్ని మతాలను, ఆచరాలను, సంప్రదాయాలను సమానంగా ఆచరించేదే హిందూ ధర్మమని పేర్కొన్నారు. అతి పురాతన, సనాతన ధర్మం, వేలాది సంవత్సరాలుగా ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన దేశం భారతదేశమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బండిరాజుల శంకర్, తోట భానుప్రసాద్, పోతంశెట్టి మీరాబాయి, కంతుల శంకర్, మొరిగాడి ప్రభు, రఘుపతి, అశోక్, రాంచందర్ పాల్గొన్నారు. -
కోటి కళల మైనా... నవ తెలంగాణ
ఏళ్ల నాటి తపస్సు ఫలించి అవతరించిన స్వరాష్ట్రం ‘కళకళ’లాడాలని నవతరం కోరుకుంటోంది. పాశ్చాత్య సంస్కృతి ధాటికి పాతబడిపోతున్న పల్లె కళలకు కొత్త వసంతం తెస్తామంటోంది. సాంస్కృతిక బానిసత్వాన్ని అడ్డుకుంటూ... సంప్రదాయ వారసత్వాన్ని మోసుకుంటూ... కోటి కళల వీణ... మా తెలంగాణ అని నిరూపిస్తామంటోంది. శిల్పారామంలో నిర్వహించిన యువజనోత్సవాల సాక్షిగా... పది జిల్లాల ప్రతిభ ప్రకాశించింది. కాసింత ప్రోత్సాహం అందిస్తే... అద్భుతాలు సృష్టిస్తానంటోంది. - ఎస్.సత్యబాబు ‘చందనాల సులోచనాల రాధా ప్రమీలో... ఊడల మర్రి కింద నాగుల పుట్ట చందనాల సులోచనాల...’ అంటూ జానపదం పల్లవించింది. ‘పాంచాలి... ఏమే ఏమేమే నీ కండకావరము..’ అంటూ పౌరాణికం ప్రతిధ్వనించింది. ‘పొరియా గడేపీ ఆయీ’ అంటూ బంజారా పాట ఝంఝుంమారుతమైతే... ‘వినరా ద్వారకా రాజా యమలోకమందుండెదనురా’ అంటూ యక్షగానం మలయమారుతమైంది. విలువలంటే కళలే... ఆయాసాల నుంచి పుట్టిన ఆటపాటలు, శ్రమైక జీవన పల్లెపదాలు జానపదంతో కదం తొక్కుతాయి. ‘ఊరికి ఉత్తరాన ఊడలమర్రి’ అనే జానపదంతో తనదైన శైలితో ఈ కార్యక్రమంలో ఆకట్టుకున్న సంజీవ్ లాంటివారు... పాప్లూ, ర్యాప్లూ మన సంప్రదాయ శైలుల ప్రాణం తీస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేయడంలో అతిశయోక్తి లేదని చూసిన వారెవరైనా అంటారు. వీటిని యువతకు దగ్గర చేయడం అంటే తెలంగాణ భవితను కళకళలాడేలా చేయడమే. ఇక తెలంగాణ ప్రాంతంలో మరో శక్తివంతమైన సంప్రదాయ కళ యక్షగానం. ‘నాన్న హయాంలో ఆయన ప్రోగ్రామ్ కోసం ఊర్లకు ఊర్లు ఎదురు చూసేవి’ అంటూ గుర్తు చేసుకున్న కరీంనగర్ వాసి ఎన్.సురేష్... యమధర్మరాజు గెటప్ వేసి యక్షగానం ఆలపిస్తే శిల్పారామంలో కళాభిమానులు కళ్లప్పగించేశారు. గోత్రాల వంటి కులాల వారికి వారసత్వంగా వస్తున్న యక్షగానం... ఇప్పుడున్న పరిస్థితిలో కెరీర్‌గా ఎంచుకోవడం దాదాపు అసాధ్యమే. అయితే అందరూ దీన్ని ఆదాయ కోణంలోనే చూస్తారనలేం. ఏ ఉద్యోగమూ లేదు... కేవలం పాటే నాకు ఉపాధి బాట అంటున్న సురేష్... కంప్యూటర్స్‌లో పీజీ చేశాడంటే ఆశ్చర్యం అనిపించక మానదు. స్వరాష్ట్రంలోనైనా యువత ‘కళ’లు సాకారం కావాలని సురేష్ కోరుకుంటున్నానన్నాడు. ఘగన్గోర్ తండా నాయకుడి ఇంటి ముందుకు వెళ్లి చేసే నృత్యం... పచ్చదనం ప్రాధాన్యత చెప్పే తీజ్ పండుగ, బావా మరదళ్ల సరసాల పాటలు, లంబాడీ, బంజారాల సంస్కృతి సంప్రదాయాల గురించి ఎంత వర్ణించినా తక్కువే. పెద్దలు, పిన్నలు ఆటపాటలతో గడిపే ఘగన్గోర్ వంటివి తరాల మధ్య అంతరాలకు సంప్రదాయం అందించిన పరిష్కారం. ‘సేవ్ వాటర్ అంటూ మా వన్ యాక్ట్ ప్లేలో సందేశం ఇచ్చాం’ అని చెప్పాడు కృష్ణానాయక్. రంగారెడ్డి జిల్లా, రామచంద్రగూడకు చెందిన ఈ కుర్రాడు... తన 10 మంది సభ్యుల బృందంతో కలిసి వన్ యాక్ట్ ప్లే, సోలో డ్యాన్స్, ఫోక్ సాంగ్ ప్రదర్శనలు ఇచ్చాడు. రెండురోజుల పాటు మాదాపూర్‌లోని శిల్పకళాతోరణం సకల తెలంగాణ కళల శోభను సింగారించుకుని నవయవ్వనిలా మెరిసి మురిసింది. వ్యయప్రయాసలు తెలియవు... ఈ ఆభరణాలు ఎంత బరువుంటాయో తెలుసా... వీటిని ధరించి గంటల పాటు మోయాలి. వీటన్నింటికీ కలిపి రూ.6 వేల వరకూ అద్దె చెల్లించాలి’ అనే ఈ దుర్యోధన వేషధారి... వేదిక ఎక్కగానే వ్యయప్రయాసలన్నీ మరిచిపోతాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఖర్చులు, శ్రమ చూసుకుంటే తృప్తి దక్కదు’ అంటున్న జనగాం వాసి గట్టగల్ల భాస్కర్.. బీఏ గ్రాడ్యుయేట్. దేశవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చిన భాస్కర్... తాము మొత్తం 20 మంది బృందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పాడు. ఫొటోలు: జి.రాజేష్ -
గోచీ పెట్టుకు తిరగండి
గోవా మంత్రికి ప్రముఖ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ లేఖ పణజి: బీచుల్లో మహిళలు కురచ దుస్తులు, బికినీలు ధరించి సంచరించడం వంటివి నిషేధించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గోవా పీడబ్ల్యుడీ మంత్రి సుదిన్ ధవళికర్పై విమర్శల జడి చుట్టుముట్టింది. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని, మిరపకాయలు, టమోటా, బంగాళ దుంపలు వంటివాటిని వినియోగించరాదని, కుర్చీలు, బల్లలపై కూర్చుని పని చేయడాన్ని నిషేధించాలని దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటు లేఖ రాశారు. లేఖలో ఎక్కడా మంత్రి పేరును పేర్కొనపోయినప్పటికీ మంత్రి వ్యాఖ్యలను వెన్‌డెల్ తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. మంత్రి వ్యాఖ్యలు అభివృద్ధి నిరోధకంగాను ఉన్నాయన్నారు. ప్రస్తుతం ధరిస్తున్న చొక్కా యూరోపియన్దని, పాంట్స్, ఫైజమాలు చైనా, మధ్య ఆసియాలవని, సాక్స్, టీ-షర్టు, బినియన్లు, లోదుస్తులు సహా యూరప్‌లో కనిపెట్టారని ఇవన్నీ పాశ్చాత్య సంస్కృతివి కాబట్టి వీటిని విడిచిపెట్టి భారతీయ సంస్కృతి అయిన శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా? అని లేఖలో ప్రశ్నించారు.