
వంశీకృష్ణ
బంజారాహిల్స్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఓ ఎన్‌ఆర్‌ఐపై బంజారాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి అతని తల్లిదండ్రులతో పాటు రెండో వివాహం చేసుకున్న యువతిని రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే .. కృష్ణాజిల్లా, నూజివీడు మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన కన్నెగంటి వంశీకృష్ణ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన సిరిచందన అనే యువతితో 2015లో అతడికి వివాహం జరిగింది.
ఆస్ట్రేలియాకు భార్యను తీసుకువెళ్లిన వంశీకృష్ణ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా అదనపు కట్నం తేవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఆమెను బలవంతంగా ఇండియాకు పంపించాడు. కుటుంబసభ్యులు, పెద్దమనుషులు నచ్చజెప్పినా అతడిలో మార్పు రాలేదు. అంతేగాకుండా ఇటీవల ఎవరికీ తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వంశీకృష్ణతో పాటు అతడి తల్లిదండ్రులు రామారావు, సీతామహాలక్ష్మిలపై చీటింగ్ కేసు నమోదు చేశారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment