పద్మ దీపిక (ఫైల్)
దుండిగల్: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా, యలమంచలి మండలం, మేడపాడు గ్రామానికి చెందిన పద్మదీపిక(35)కు నాలుగేళ్ల క్రితం రవికిరణ్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కొంత నగదు, బంగారాన్ని కట్నకానుకలుగా అందజేశారు. వీరికి ఇద్దరు సంతానం.
రెండేళ్ల క్రితం రవికిరణ్ కుటుంబంతో సహా నగరానికి వలస వచ్చి ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతను అదనపు కట్నం తేవాలని భార్యను నిత్యం శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు తీవ్రం కావడంతో మనస్థాపానికి గురైన దీపిక ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను కిందకు దింపి మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. భర్త రవికిరణ్, అత్తమామలు తులసి లక్ష్మి, ఈశ్వర్‌రావు వేధింపుల కారణంగా తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు శివగణేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment