
అన్నానగర్: అన్నానగర్‌లో వరకట్నం ఇవ్వలేదని వరుడి ఇంటి వారు పెళ్లిని ఆపారు. చెన్నై అన్నానగర్‌కు చెందిన సుమతి (30) (పేరు మార్చాం). ఈమెకు చెన్నై సేత్తుపట్టు శ్రీనాథ్‌కి గత ఏడాది నవంబర్ 22న నిశ్చయతార్థం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 5న వివాహం చేయడానికి పెద్దలు నిర్ణయించుకున్నారు. వధువు తరఫున పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం పంచారు. బుధవారం ఉదయం పెళ్లి జరగనున్న క్రమంలో వధువు తరఫు వారు వరకట్నం ఇవ్వకపోవడంతో పెళ్లిని ఆపేశారు. వధువు ఇంటి వారు అన్నానగర్ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment