
రాణి (ఫైల్)
హస్తినాపురం: అదనపు కట్నం కోసం తాగిన మైకంలో భార్య నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా, పాలేరుకు చెందిన భుక్యా సందీప్, భుక్యా రాణిలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చిన వీరు వనస్థలిపురం సాహెబ్‌నగర్ వీకర్‌సెక్షన్ కాలనీలో నివాసముంటున్నారు.
సందీప్ తరచూ తాగి వచ్చి భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడు. బుధవారం రాత్రి వారి మధ్య గొడవజరిగింది. దీంతో అర్ధరాత్రి రాణి నిద్రిస్తుండగా సందీప్ దిండుతో ఆమె ముఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం కుమారుడు యశ్వంత్‌ను తీ సుకుని పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాణి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమి త్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు సందీప్‌పై కేసు నమోదు చేసి అతని కోసం గాలిస్తున్నారు.