విశాఖపట్నం, అనకాపల్లిటౌన్: వరకట్న వేధింపులకు మరో వివాహిత బలైంది. తుమ్మపాలలోని తన ఇంట్లో సంధ్యారాణి(26) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అయితే అత్తింటివారే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని సంధ్యారాణి పుట్టింటివారు ఆరోపిస్తున్నారు. సంధ్యారాణి తండ్రి వై.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన వాయిబోయిన శ్యామ్‌కు, యలమంచిలికి చెందిన వై.సంధ్యారాణి(26)కి గత ఏడాది డిసెంబర్ 20న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో సంధ్యారాణి తండ్రి నాగేశ్వరరావు రూ.ఎనిమిది లక్షల నగదు, ఒక వాహనం, సారె, తొమ్మిది తులాల బంగారం కట్నంగా ఇచ్చా రు. రూ.8 లక్షల కట్నంలో రూ.3లక్షలు పెళ్లి ఖర్చుల నిమిత్తం శ్యామ్ తల్లిదండ్రులకు ఇచ్చారు.
మిగిలిన రూ.5 లక్షలు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసిన రూ.5 లక్షలు తీసుకురావాలని ఐదునెలల నుంచి భర్త కుటుంబ సభ్యులు సంధ్యారాణిపై వత్తిడి తెచ్చారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. బుధవారం ఉదయం సంధ్యారాణి తన తల్లి వెంకటలక్ష్మికి ఫోన్ చేసి, డిపాజిట్ సొమ్ము కోసం చెప్పగా వచ్చే ఆదివారం పెద్దల సమక్షంలో నిర్ణ యం తీసుకుందామని ఆమె కుమార్తెను సముదాయిం చింది. కానీ అప్పటికే మనస్తాపంతో ఉన్న సంధ్యారాణి మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా శ్యామ్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతురాలి తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పోలీ సులు సంధ్యారాణి అత్త సత్యవతి, ఆడపడుచు లక్ష్మితోపాటు సంధ్యారాణి భర్త శ్యామ్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. పెళ్ళై ఏడాది జరగకముందే సంధ్యారాణి ఆత్మహత్యకు పాల్పడ డం అందర్నీ కలచివేసింది. సంధ్యారాణి పుట్టిం టివారు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ దిశగా కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment