ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెండ్‌ | Suspended for two Field Assistants | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్ల సస్పెండ్‌

Published Tue, Sep 27 2016 12:43 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

Suspended for two Field Assistants

నెల్లికుదురు : జాతీయ ఉపాధి హామీ  పథకం పనుల్లో జాప్యం చేస్తున్నారనే కారణంతో ఇద్దరు ఫీల్డ్‌ అసిస్టెంట్లను డ్వామా పీడి వై.శేఖర్రెడ్డి సోమవారం సస్పెండ్‌ చేశారు. స్థానిక ఈజీఎస్‌ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించిన పీడీ.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
ఉపాధి పనుల పనితీరును పరిశీలించి, సక్రమంగా నిర్వహించని బొడ్లాడ, చిన్నముప్పారం ఫీల్డ్‌ అసిస్టెంట్లు కొత్తపల్లి బిక్షం, రాజయ్యను  సస్పెం డ్‌ చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు కాంపోస్ట్‌ పిట్స్‌ మంజూరయ్యాయని, వాటిని నిర్మించుకున్న వారికి రూ.4500 అందిస్తామని తెలి పారు. ఏపీడీ హనుమంతరావు, ఎంపీడీఓ హరి ప్రసాద్, ఏపీఓ మధు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement