ఐటీ రంగంలో మార్పులతో పెరిగిన ఉపాధి అవకాశాలు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్
బాలాజీచెరువు (కాకినాడ): ఐటీ రంగంలో వచ్చిన మార్పులతో సాఫ్ట్‌వేర్ రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రగతి కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రిజమ్ 2కే17 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో వచ్చిన మార్పులను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరంతర నైపుణ్యాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చుపుతూ ప్రైవేట్ రంగంలోనే కాకుండా ప్రభుత్వ రంగంలో కూడా చేరి తమ వంతు బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ శంభుప్రసాద్ కళాశాల ప్రగతిని వివరించారు. పరుచూరి కమలాంబ జ్ఞాపకార్థం 2013 నుంచి అన్ని విభాగాల్లో అకడమిక్ టాపర్స్‌కు ఇచ్చే నగదు పురస్కారం అందజేశారు. ప్రగతి కళాశాల చైర్మన్ కృష్ణారావు టీసీఎస్ సంస్థ తమ కళాశాలతో ఒప్పందం చేసుకుని ఉత్తమ అవార్డును అందజేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ మేనేజ్‌మెంట్ ఎం.వి.హరినాథబాబు, డైరెక్టర్ రఘురామ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్, మాచిరాజు తదితరులు పాల్గొన్నారు.