రాబంద ప్రాంతంలో నీటమునిగిన వరిపంట
వర్షాలకు కొన్నిచోట్ల ఉభాలు..
మరికొన్ని చోట్ల నీటమునిగిన పంటలు
మెంటాడ : మండలంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండలంలోని పోరాం, పెదమేడపల్లి, కుంటినవలస, గుర్రమ్మవలస, కూనేరు తదితర గ్రామాల్లో ఉభాలు జరుగుతుండగా.. రాబంద, గుర్ల, వానిజ, పిట్టాడ, ఆండ్ర, లోతుగెడ్డ, తదితర గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ప్రతి ఏడాదీ ఏదో ఒక రూపంలో పంటలు నాశనమవుతున్నాయని రైతులు వాపోతున్నారు.