
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజా నిర్ణయంతో 7 వేలకుపైగా ఫీల్డ్ అసిస్టెంట్లకు లబ్ధి జరుగుతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ కవితను కలిసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపినవారిలో.. టీఆర్‌ఎస్ పార్టీ కార్మిక విభాగం ఇన్‌చార్జి రూప్ సింగ్, టీఆర్‌ఎస్ కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, టీఎస్ ఫుడ్స్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment