పొలాల్లో ఏనుగుల మంద విధ్వంసం
Published Mon, Dec 7 2015 9:41 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
సీతంపేట: శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలో ఏనుగుల మంద విధ్వంసం సృష్టించింది. స్థానిక మోహన్ కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి గ్రామ పరిసరాల్లోకి వచ్చిన ఏనుగులు వరి, అరటి పంటలను ధ్వంసం చేశాయి. రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అక్కడే తిష్ట వేయడంతో గిరిజనులు భయాందోళనలకు గురయ్యారు. కాలనీ వాసులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగుల రాకతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచి పోయాయి.
Advertisement
Advertisement