అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కొనిజెర్ల (ఖమ్మం) : అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం బసవాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చల్లా వీరబాబు(38) గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఔట్‌సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాలలో పత్తి సాగు చేశాడు. నీళ్లు లేక అది ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.