Konijerla
-
ఆగని టీడీపీ శ్రేణుల విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల విధ్వంసకర చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి, సోమవారం పలు గ్రామాల్లో ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయ భవనంపై టీడీపీ, జనసేన జెండాలు ఎగురవేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ⇒ కృష్ణాజిల్లా కంకిపాడు మండలం మంతెన గ్రామంలోని ప్రధాన సెంటరు సమీపంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గతంలో మండలంలోని గొల్లగూడెం పంచాయతీపై యువగళం జెండా ఎగురవేశారు. ఈడుపుగల్లు, కంకిపాడు గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఉప్పలూరులో సచివాలయ భవనంపై ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతో కూడిన బోర్డును పగులగొట్టారు. ⇒ నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరంలో నిర్మాణంలోని ప్రభుత్వ భవనాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాలను పగులగొట్టారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రాల్లో గోడలపై ఉన్న నవరత్నాల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. నిర్మాణంలో ఉన్న విలేజ్ హెల్త్‌క్లినిక్ భవనం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక పంచాయతీ కార్యాలయంపైన ఉన్న సచివాలయం గోడకు అమర్చిన నవరత్నాల శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన వివరాలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటోతోసహా ఈ శిలాఫలకంపై ఉన్నాయి. గ్రామ శివారున గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ ఫొటోతో ఉన్న స్వాగత బోర్డులను ఊడబెరికారు.ఈ ఘటనల్ని సర్పంచ్ వీధి వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ మద్దింశెట్టి దొరబాబు, నాయకులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మండపేట రూరల్ సీఐ శ్రీధర్, అంగర ఎస్ఐ అందే పరదేశి పరిశీలించి వివరాలు సేకరించారు. సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు మాట్లాడుతూ సచివాలయం ప్రభుత్వ ఆస్తి అని, దీన్ని ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ఈ ఘటనలకు పాల్పడినవారిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ⇒ అనకాపల్లి జిల్లా మాడుగుల రూరల్ మండలంలో గిరిజన పంచాయతీ అయిన లోవపోన్నవోలు గ్రామ సచివాలయం భవనం మీద కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన జెండాలు ఎగురవేశారు. ఈ విషయమై ఎంపీడీవో ఆర్.కాళీప్రసాదరావును అడగగా.. ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయజెండా మినహా పార్టీ జెండాలు పెట్టకూడదని చెప్పారు. వీటిని వెంటనే తొలగిస్తామని తెలిపారు. ⇒ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెర్లలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ ప్రదేశాన్ని సోమవారం తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, వైఎస్సార్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా స్వామిదాసు మాట్లాడుతూ భావితరాలకు ఆదర్శంగా గ్రామాల్లో నెలకొలి్పన నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం అరాచక చర్య అని చెప్పారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారని, అలాంటి నాయకుడిని ప్రతి ఒక్కరు గౌరవించాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లా కరుణాకరరావు, కావూరి వినయ్‌కుమార్, కలకొండ రవికుమార్, ఎంపీటీసీ సభ్యురాలు కటుకూరి రాధమ్మ, సొసైటీ మాజీ అధ్యక్షులు నంబూరి వెంకటకృష్ణారావు, నంబూరి కృష్ణారావు, నాయకులు వెంకటరెడ్డి, బాబూరావు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. పేదల ఇంటి నిర్మాణాలు ధ్వంసంచాట్రాయి మండలం పోలవరంలో పేట్రేగిన టీడీపీ నేతలుచాట్రాయి: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో టీడీపీ నాయకులు పేట్రేగిపోయారు. గత ప్రభుత్వం పేదలకు ఇచి్చన స్థలాల్లో లబ్ధిదారులు చేపట్టిన ఇంటి నిర్మాణాలను ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి జేసీబీతో రెండు ఇళ్ల పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకిలించివేశారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పోలవరం గ్రామంలోని మంకొల్లు రోడ్డులో నాలుగో లే అవుట్లో 28 మంది పేదలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంటిస్థలాలు మంజూరు చేసింది.వాటికి రిజి్రస్టేషన్ చేయించి పట్టాలు ఇచ్చింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు దానం బాబూరావు, కొంగర దేవదత్తం తమకు ఇచ్చిన స్థలాల్లో రూ.2 లక్షల వంతున వెచ్చించి ఇంటి నిర్మాణాల కోసం పునాదులు నిర్మించి, పిల్లర్లు వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల అదే గ్రామంలో జగనన్న లే అవుట్లో వేల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రావెల్ రోడ్లను ధ్వంసం చేశారు.రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి సొంత నియోజకవర్గంలో ఇలాంటి విధ్వంసాలు చేపట్టడం దారుణమని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి పిల్లర్లు, ఫౌండేషన్ నిర్మాణాలను పెకలించి వేయడంపై బాధితులు ఫిర్యాదు చేశారని, విచారించి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని తహసీల్దార్ మహ్మద్ మసూద్ అలీ తెలిపారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లోను ఫిర్యాదు చేసినట్టు లబ్ధిదారులు చెప్పారు. -
తీరని శోకం.. రాములవారి భజనలో అపశ్రుతి..
కొణిజర్ల: పండుగపూట విషాదం నెలకొంది. ఆలయంలోకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లి పాడులో ఆదివారం రాత్రి చోటు చేసు కుంది. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీరామనవమి సందర్భంగా పల్లిపాడు అభయాంజనేయ స్వా మి దేవాలయంలో ఏర్పాటు చేసిన భజనకు తుమ్మలపల్లికి చెందిన 25 మంది వచ్చారు. కొందరు పిల్లలను వెంటబెట్టుకొచ్చారు. పెద్ద లు భజన చేస్తుండగా, పిల్లలు ఆడుకుంటున్నా రు. రాత్రి 9 దాటాక ఖమ్మం నుంచి దిద్దుపూడికి వేగంగా వెళ్తున్న బొలేరో ఆలయ సమీపానికి రాగానే అదుపు తప్పింది. పక్కన ఉన్న వి ద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, అదేవేగంతో దేవాలయంలోకి దూసుకెళ్లింది. దీంతో ఆలయం గో డ విరిగి పక్కనే ఆడుకుంటున్న పగడాల దేదీప్య(9), పగడాల సహస్ర(7)తో పాటు ఇజ్జగాని అలేఖ్యపై పడింది. తీవ్రగాయాలైన చిన్నారులను ఖమ్మం తరలిస్తుండగా దేదీప్య, సహస్ర మృతి చెందారు. అలేఖ్య గాయాలతో బయట పడింది. వాహనం డ్రైవర్ మద్దెల పోతురాజు, వాహనంలో ఉన్న నాగటి వెంకన్న సైతం తీ వ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఖమ్మం తరలించారు. తీరని శోకం.. తుమ్మలపల్లికి చెందిన పగడాల ఆదినారాయణ, శిరీష దంపతులకు ఇద్ద రూ ఆడపిల్లలే. ఆదినారాయణ పెయింటర్‌గా పనిచేస్తూనే ఆలయాల్లో భజనలకు తబలా వాయిద్యకారుడిగా వెళ్తుం టాడు. పల్లిపాడులో భజనకు భార్యాభర్తలు వెళ్తూ, కుమార్తెలు దేదీప్య, సహస్రను కూడా వెంట తీసుకెళ్లారు. ఊహించని విధంగా జరి గిన ప్రమాదంలో చిన్నారులిద్దరూ మరణించడంతో ఆ దంప తుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. -
హెల్మెట్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టి ప్రయాణం.. మృత్యు రూపంలో వచ్చిన మరో బైక్
సాక్షి, ఖమ్మం (కొణిజర్ల): అనుకోని ప్రమాదం ఆ ఇంట విషాదాన్ని నింపింది. ఖమ్మంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తల్లాడ మండలం రెడ్డిగూడెంకు చెందిన మోదుగు కృష్ణయ్య (44) రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందారు. బండికున్న హెల్మెట్ ధరించి ఉంటే..బతికేవాడేమో అంటూ అయినవారు కన్నీరు పెడుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో చిట్టీ డబ్బులు తీసుకుని తన బైక్‌పై..అత్తగారి ఊరు ముదిగొండ మండలం మేడేపల్లికి వెళ్తున్న క్రమంలో కొణిజర్ల ఏపీజీవీబీ వద్ద రోడ్డు దాటుతుండగా మరో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కృష్ణయ్య కింద పడిపోగా తల రోడ్డుకు గుద్దుకుని తీవ్రంగా గాయపడ్డారు. అయితే..హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకుండా బండి ట్యాంక్‌పై ఉంచి ఖాళీగా వస్తున్నారు. చదవండి: (స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..) ఒకవేళ హెల్మెట్ పెట్టుకుని ఉంటే తల భాగం సురక్షితంగా ఉండేదని, మరణం సంభవించి ఉండేది కాదని పలువురు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కాసేపటికే వైరా నుంచి ఖమ్మం వెళ్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రమాదస్థలిలో ఆగి మానవత్వం చాటారు. కృష్ణయ్యతో పాటు గాయపడిన మరో ద్విచక్రవాహనదారుడు, కొణిజర్లకు చెందిన చింతల వీరేందర్‌ను తన ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణయ్య సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఐదు నెలలుగా కృష్ణయ్య మేడేపల్లిలో ఉంటున్నారు. ఈ దుర్గటనతో మృతుడి భార్య అశ్విని, పిల్లలు మోజెస్‌బెన్నీ, సాత్విక కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై కొణిజర్ల ఎస్సై టీవై.రాజు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి: (సరదాగా గడిపేందుకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలో విషాదం) -
కలెక్టరేట్లో గన్‌మెన్‌గా భర్త.. ఆస్పత్రికి చేరేలోపే భార్య, కొడుకు మృతి
కొణిజర్ల: కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోతే తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లాలనుకుంది. పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ కలెక్టరేట్లో గన్‌మెన్‌గా ఉన్న భర్తకు తీరిక లేకపోవడంతో మరిదిని వెంట పెట్టుకుని బయలుదేరిన క్రమంలో ఆస్పత్రికి చేరకుండానే జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం విదితమే. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన జెర్రిపోతుల సంధ్య తన కుమారుడు మహంత్‌ను తీసుకుని మరిది పుల్లారావుతో ఖమ్మంలోని ఆస్పత్రికి బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. (చదవండి: తల్లికి కరోనా పాజిటివ్.. బిడ్డకు నెగెటివ్) మార్గమధ్యలో వారిని టిప్పర్ ఢీకొట్టింది. పుల్లారావు, మహంత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృత్యువాత పడగా సంధ్య హైదరాబాద్ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరి మృతదేహాలను గురువారం స్వగ్రామానికి తీసుకురాగా కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులంతా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆస్పత్రికి బయలుదేరుతున్నప్పుడు గంటలో వస్తామని చెప్పిన వారు మృతదేహాలుగా రావడంతో కుటుంబీకులు రోదించిన తీరు అందరికీ కన్నీళ్లు పెట్టించింది. డ్యూటీ నిమిత్తం ఎక్కడకు వెళ్లినా గంటగంటకూ తనతో వీడియో కాల్లో మాట్లాడే కుమారుడు, భార్య మృతదేహాలను చూస్తూ నాగరాజు ఏడుస్తూ స్పృహ తప్పారు. ఇక ఆయన కుమార్తె రిషిత తల్లి, సోదరుడిని చూస్తూ అమాయకంగా రోదిస్తుండడం కలిచివేసింది. అలాగే, అన్న నీడలా వెన్నంటి ఉండే పుల్లారావు మృతితో ఆయన భార్య పద్మ, 8 నెలల కుమారుడు భార్గవ్ రోదిస్తుండగా ఆపడం ఎవరివల్లా కాలేదు. ముగ్గురి మృతదేహాలను ఒకే ట్రాక్టర్‌పై ఉంచి అంతిమయాత్ర నిర్వహించి కన్నీటి వీడ్కోలు పలికారు. చదవండి: పెళ్లి సంబంధాలు రాక.. ఒంటరిగా ఉండలేక యువతి -
ఫీల్డ్ అసిస్టెంట్ బలవన్మరణం
కొనిజెర్ల (ఖమ్మం) : అప్పుల బాధ భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొనిజెర్ల మండలం బసవాపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చల్లా వీరబాబు(38) గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఔట్సోర్సింగ్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాలలో పత్తి సాగు చేశాడు. నీళ్లు లేక అది ఎండిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.