హైదరాబాద్ : తెలంగాణలో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కరువుకాటుకు అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే ఎండిపోతుంటే గుండె ధైర్యం చెడి వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. చేసిన అప్పులు ఒకవైపు, వర్షాల లేమి, విద్యుత్ కోతలతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని తనువు చాలిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో అయిదుగురు రైతులు మృతి చెందారు. గురు, శుక్రవారాల్లో జిల్లాలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, మరో రైతు గుండె ఆగిపోయింది.
షాబాద్ మండలం కుమ్మరిగూడకు చెందిన కుమ్మరి సత్తయ్య (38), వికారాబాద్ మండలం ధన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్య (40) ఉరి వేసుకోగా, పరిగి మండలం సదయ్యద్ పల్లికి చెందిన రైతు మల్లిగారి రామస్వామి (40), మర్పల్లి మండలం తిమ్మాపూర్కు చెందిన అంజయ్య పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇక వికారాబాద్ మండలం పులుసుమామిడిలో బురాన్ (45) అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లాలో నలుగురు రైతుల ఆత్మహత్య
Published Sat, Oct 25 2014 9:17 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement