
సిడ్నీ వేడుకల్లో 200 మందిపైగా అరెస్ట్
సిడ్నీ: ఆస్ట్రేలియాలోని సిడ్నీ మ్యూజిక్ ఫెస్టివల్ లో 200 మందిపైగా అరెస్టయ్యారు. మత్తుపదార్థాలు సేవించడం, విక్రయించడం ఆరోపణలతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 130 మత్తు పదార్థాల మాత్రలు, 1,443 డాలర్ల నగదుతో పట్టుబడిన 24 ఏళ్ల యువతి కూడా ఉంది.
కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా సిడ్నీలో దశాబ్దం క్రితం నుంచి మ్యూజిక్ ఫెస్టివల్ నుల ప్రతియేట నిర్వహిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ వేడుకల్లో పాల్గొనేందుకు స్థానికులతో పాటు అంతర్జాతీయ పర్యాటకులు అమితాసక్తి చూపుతుంటారు. దాదాపు 30 వేల మంది ఈ వేడుకలకు హాజరయ్యారు.
మరోవైపు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మత్తుపదార్థాలు వినియోగిస్తున్న వారిలో ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువ ధరకు డ్రగ్స్ అమ్ముతారు. అందుకే కొలంబియా, పనామా, మెక్సకో నుంచి మత్తుపదార్థాలు ఇక్కడికి అక్రమంగా రవాణా చేస్తుంటారని అధికార సమాచారం ఆధారంగా తెలుస్తోంది.