అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.
వైఎస్ఆర్ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం
Published Wed, Jan 20 2016 1:12 PM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
జమ్మలమడుగు: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కడప జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పెద్దముడిగం, జమ్మలమడుగు మండలాల్లో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తోంది. ప్రొద్దుటూరు, మద్దనూరు మండలాల్లో ఉదయం నుంచి వర్షం పడుతోంది. దీంతో జొన్న, వేరుశనగ పంటలు నీటమునిగాయి. పొలాల్లో నీళ్లు నిలిచిపోవడంతో పంటలకు నష్టం వాటిల్లింది. వందల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లడంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు.
Advertisement
Advertisement