టీడీపీ నాయకుడు పాటిల్ అజయ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్న ఫీల్డ్ అసిస్టెంట్ తిప్పేస్వామి
సాక్షి, కణేకల్లు: ఆదిగానిపల్లికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ తిప్పేస్వామి పచ్చరంగు పూసుకున్నాడు. టీడీపీ నాయకులతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు ఏకంగా ఊళ్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అసలే కూలీలు అత్యధికంగా ఉన్న గ్రామం ఆదిగానిపల్లి. ‘ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే మీకు ఉపాధి పని కల్పిస్తా.. లేకపోతే పని ఉండదు మీ ఇష్టం. ఆలోచించండి... ఉపాధి లేకపోతే ఊరు వదిలి బతుక్కునేందుకు బెంగళూరుకు వెళ్లాల్సి వస్తుంది’ అంటూ కూలీలను హెచ్చరిస్తున్నాడు.
గ్రామంలో టీడీపీ తరఫున జరిగే ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తూ కూలీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతేకాకుండా టీడీపీకి ఓటేస్తేనే మీ పింఛన్ వస్తాది.. లేకపోతే పింఛన్ కూడా పోతుంది అంటూ పింఛన్‌దారులనూ బెదిరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ప్రత్యక్షంగా టీడీపీకి ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడ్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment