గెంటేశారు! | 353 Field Assistants of the elimination | Sakshi
Sakshi News home page

గెంటేశారు!

Published Sat, Mar 26 2016 4:27 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

గెంటేశారు! - Sakshi

గెంటేశారు!

353 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
పదేళ్లు వెట్టిచాకిరీ చేయించుకుని పంపించేశారని ఆవేదన
అధికార పార్టీ సానుభూతిపరుల నియామకానికి కసరత్తు

 
 ‘మేము విధుల్లో చేరేటప్పటికి కోరిన వారికి మాత్రమే పనిచూపాలని ఉపాధి హామీ చట్టం చెప్పింది. ఆ తర్వాత పాలకులు లేబర్ కమిషన్, బడ్జెట్.. అంటూ ఏవేవో కుంటిసాకులు చూపుతున్నారు. పదేళ్లు పనిచేయించుకుని అన్యాయంగా గెంటేశారు. ఇప్పుడు మాతోపాటు మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలూ వీధినపడ్డాయి. ఎలా బతకాలో తెలియడం లేదు..’ అంటూ జిల్లాలో తొలగింపునకు గురైన ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తమకు న్యాయం  చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు.
 
 
 సాక్షి ప్రతినిధి, తిరుపతి:
జిల్లాలో 353 మంది క్షేత్ర సహాయకులపై ప్రభుత్వం వేటు వేసింది. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో కొన్ని రోజుల్లో ‘పచ్చ’ ఫీల్డ్ అసిస్టెంట్లు కొలువుదీరనున్నారు.

కుంటిసాకులు చూపుతూ..
 గత ఏడాది ఆగస్టులో జిల్లాలో పనిచేస్తున్న 353 వుంది క్షేత్ర సహాయుకులు లేబర్ బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకోలేదన్న సాకుతో ప్రభుత్వం వారిని పక్కనపెట్టింది. బాధిత ఫీల్డ్ అసిస్టెంట్లుతమ యుూనియున్ నాయకుల సహాయుంతో కోర్టు తలుపు తట్టారు. న్యాయు స్థానం నుంచి తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకొని విధులు నిర్వర్తించారు. కానీ ప్రభుత్వం వారికి వేతనాలు మంజూరు చేయలేదు. ప్రభుత్వ, క్షేత్ర సహాయుకులకు సంబంధించిన న్యాయువాదుల వాదనలు విన్న హైకోర్టు రెండు నెలల క్రితం ఆర్డీవో నేతృత్వంలో త్రిసభ్య కమిటీ విచారణకు ఆదేశించింది. కమిటీ నిర్ణయుమే తుది నిర్ణయువుని తన తీర్పులో వెల్లడిందించి.

రెండు నెలలుగా జిల్లాలోని తిరుపతి, వుదనపల్లి, చిత్తూరు ఆర్డీవో నేతృత్వంలో వుూడు కమిటీలు వేసి వారివారి పరిధిలోని వుండలాల క్షేత్ర సహాయుకులను విచారించారు. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విచారించారు. ఈ మేరకు త్రిసభ్య కమిటీ గతంలో తొలగించిన ఫీల్డ్‌అసిస్టెంట్లందరీ శాశ్వతంగా తొలగిస్తున్నట్లు నివేదిక అందించారు. దీంతో జిల్లాలో 353 పంచాయతీల్లో కోర్టు స్టే ద్వారా పనిచేస్తున్న క్షేత్ర సహాయుకులను శాశ్వతంగా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారి స్థానాల్లో కొత్తవారి నియూవుకానికి వెంటనే చర్యలు చేపట్టాలని 61 వుండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు అందారుు. క్షేత్ర సహాయుకుల కొత్త జాబితాను వీలైనంత త్వరగా జిల్లా కేంద్రానికి పంపించాలని డ్వావూ పీడీ వేణుగోపాల్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెత్తనమంతా జన్మభూమి కమిటీలదే
 జన్మభూమి కమిటీలే కొత్త ఫీల్డ్ అసిసెంట్ల పేర్లలను ప్రతిపాదించనున్నాయి. వీరు పంపిన జాబితాను మండల కమిటీలు పరిశీలించి తుది జాబితా డ్వామాకు పంపాల్సి ఉంటుంది. కొత్తగా ఎంపికయ్యే అభ్యర్థులు.. ఆ గ్రామస్తులై ఉండాలి. 10వ తరగతి పాస్‌గాని, ఫెయిల్ అయినా ఫర్వాలేదు. 18-35 వయస్సులోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. విధిగా ఏడాదిలో 25 రోజులు పనిచేసి ఉండాలి. ఆ గ్రామంలో సర్పంచ్ రిజర్వేషన్ ఏది ఉంటే. ఆ రిజర్వేన్ కేటగిరికి చెందిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

వీధినపడ్డ 353 కుటుంబాలు
 పదేళ్లుగా తవు వద్ద వెట్టి చాకిరీ చేరుుంచుకొని ఇప్పుడు గెంటేశారని తొలగించిన క్షేత్ర సహాయుకులు విలపిస్తున్నారు. 2006లో తావుు పనిలో చేరినప్పుడు పనికోరిన వారికి వూత్రమే పని కల్పించాలన్న ఉపాధి హామీ చట్టాన్ని తవుకు నేర్పారని, కానీ ప్రస్తుతం తవుకు లేబర్ బడ్జెట్ల ద్వారా లక్ష్యాలను చేరుకోలేదంటూ తవు కడుపులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయుం వల్ల తవుకుటుంబాలు వీధిన పడ్డాయుని బోరువుంటున్నారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీతో గద్దెనెక్కిన పాలకులు అధికారంలోకి రాగానే ఉన్న జాబులు ఊడగొట్టడం ఎంత వరకు సమంజసవుని పలువురు ప్రశ్నిస్తున్నారు. తమకు ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement