పొలాలు.. ప్లాట్లు
పొలాలు.. ప్లాట్లు
Published Wed, Oct 5 2016 11:04 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM
లేఔట్‌ను తలపించేలా హంగూ ఆర్భాటాలు
హద్దు రాళ్లు తొలగిస్తున్నా ఆగని వ్యాపారం
తాజాగా హాజీపూర్ మండల ప్రకటన
ఇక జోరందుకోనున్న భూ వ్యాపారాలు
మంచిర్యాల రూరల్ : జిల్లా కేంద్రంగా మారనున్న మంచిర్యాల మండలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. పచ్చని పంట పొలం వెంచర్ గా మారుతోంది. మంచిర్యాల జిల్లా, నస్పూర్, హాజీపూర్ మండలాల ప్రకటనతో రియల్ వ్యా పారం వేగం పుంజుకుంది. లేఔట్ పొలాలు.. ప్లాట్లు అనుమతి లేకున్నా.. హంగూ ఆర్భాటాలతో లేఔట్‌ను తలపిస్తూ ప్లాట్లు విక్రరుుస్తున్నారు. అనుమతి లేని లేఔట్‌లపై కొరడా ఝళిపించాలని ఇప్పటికే కలెక్టర్ జగన్మోహన్ డివిజన్, మండల స్థారుు అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారి ప్రత్యేక అధికారిగా ఈవోపీఆర్‌డీ, పంచాయతీ కార్యదర్శులతో ఐదు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యూరుు. నెల రోజుల క్రితం మంచిర్యాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో 120 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అనుమతిలేని లేఔట్‌లలో హద్దు రాళ్లు తొలగించారు. అరుునా రియల్ వ్యాపారులు అదేం పట్టించుకోకుండా భూ దందా సాగిస్తున్నారు. అధికారులు ఓ వైపు నోటీసులు జారీ చేస్తూ దశలవారీగా హద్దు రాళ్లు తొలగిస్తున్నా రియల్ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉండగా.. ప్రధానంగా నస్పూర్, తీగల్‌పహాడ్, వేంపల్లి, ముల్కల్ల, గుడిపేట, హాజీపూర్, దొనబండ, నర్సింగాపూర్, రాపల్లి గ్రామాల్లో రియల్ దందా సాగుతోంది. తాజాగా హాజీపూర్ మండల ప్రకటనతో భూముల ధరకు రెక్కొలొచ్చాయి. మంచిర్యాల జిల్లా ఏర్పాటుతోపాటు హాజీపూర్, నస్పూర్ మండలాల ప్రకటనతో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా రియల్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు.
పచ్చని పంట పొలాల మధ్య..
జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పంట పొటాలు, మామిడి వనాల్లో వెంచర్లు తయారవుతున్నాయి. గత నెలలో తొలగించిన హద్దురాళ్లను తిరిగి యధాస్థానంలో ఏర్పాటు చేస్తూ కొత్తగా ప్లాట్లు చేస్తున్నారు. అమాయక ప్రజలకు లేఔట్‌లేని ప్లాట్లను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా ప్లాట్లు చేస్తున్న వారికి నోటీసులు అందతున్నా స్పందించని కారణంగా అధికారులు చర్యలకు సిద్ధమయ్యూరు.
నిర్ధారించుకుని కొనుగోలు చేయాలి..
మండలంలోని ఆయా గ్రామాల్లో అనుమతి లేకుండా అక్రమ లేఔట్‌లు వెలుస్తున్నారుు. అలాంటి స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి. రియల్ వ్యాపారుల వలలో పడి మోసపోవద్దు. ఇప్పటికే నోటీసులు జారీ చేయగా హద్దురాళ్లను సైతం తొలగించాం. ప్రజలు స్థలాలు కొనుగోలు చేసే సమయంలో అన్ని పరిశీలించి తగిన నిర్ధారణకు వచ్చిన తర్వాత కొనుగోలు చేయూలి.
- శంకర్, ఈఓపీఆర్‌డీ, మంచిర్యాల
Advertisement
Advertisement