బిక్నూరులో అడవి పందుల భీభత్సం | boars attack on fields | Sakshi
Sakshi News home page

బిక్నూరులో అడవి పందుల భీభత్సం

Published Sat, Aug 22 2015 1:18 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

boars attack on fields

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో అడవి పందులు భీభత్సం సృష్టించాయి. జిల్లాలోని బిక్నూరు మండలం ఆరెపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్థరాత్రి చెరకు పంటపై దాడిచేసి ధ్వంసం చేశాయి. గ్రామానికి సమీపంలో 9 ఎకరాల చెరకు పంటపై దాడికి దిగిన అడవి పందులు సుమారు రూ.3.50 లక్షల పంటను నాశనం చేశాయి.

గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా చెరకు సాగు చేస్తే సుమారు 50 టన్నుల దిగుబడి వస్తుందని, అలాంటిది 9 ఎకరాల మేరా పంట నాశనం అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు తమ మొర ఆలకించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement