ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు.
పాల్వంచ రూరల్: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం తొగ్గుడెంలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమరం రామారావు (34) మంగళవారం మధ్యాహ్నం పొలం పనుల్లో ఉండగా వర్షం మొదలైంది. దీంతో చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.