వీఆర్‌ఓలు ఫీల్డ్‌కు వెళ్లాలి | VROs go to Field | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓలు ఫీల్డ్‌కు వెళ్లాలి

Published Wed, Jul 20 2016 12:07 AM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

మాట్లాడుతున్న జేసీ దివ్య - Sakshi

మాట్లాడుతున్న జేసీ దివ్య

  • వచ్చిన 2,01,762 దరఖాస్తులన్నీ పరిశీలించాలి..
  • ప్రభత్వ నిర్ణయం మేరకు పాసుపుస్తకాలు అందజేస్తాం
  • జాయింట్‌ కలెక్టర్‌ దివ్య
  • బోనకల్‌ : సాదా బైనామాకు వచ్చిన 2,01,762 దరఖాస్తులన్నింటినీ పరిశీలించాలని, అందుకు వీఆర్‌ఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని, కార్యాలయాల్లో కూర్చోకుండా ఫీల్డ్‌కు వెళ్లాలని జాయింట్‌ కలెక్టర్‌ దివ్య సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఖమ్మం జిల్లా మూడో స్థానంలో ఉందని, పేద రైతులకు సాదాబైనామాలు వరమన్నారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు పాసు పుస్తకాలను అందజేస్తామన్నారు. ముష్టికుంట్ల గ్రామంలో 129 ఎకరాల దేవుడుమాన్యం ఆక్రమణలో ఉందని, సంబంధిత రికార్డులను తనకు పంపాలని తహసీల్దార్‌ సుదర్శన్‌రావును కోరారు. అదేవిధంగా గ్రామకంఠం భూమితో ఎవరికి సంబంధం లేదని, ఎటువంటి కట్టడాలకు అనుమతి లేదన్నారు.
    మండలంలో ఇసుక రేవుల నుంచి అనుమతి లేకుండా వేలాది ట్రిప్పుల ఇసుకను ఖమ్మంకు అక్రమ రవాణా చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు లిఖిత పూర్వకంగా జేసీకి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ఊర చెరువు కట్టను ఒక వ్యక్తి తొలగించి కోళ్లఫారం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. ఆ వ్యక్తిపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని తహసీల్దార్‌ను జేసీ ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ విద్యాలతను హరితహార లక్ష్యం ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించారు. దీపం పథకం కింద రూ.2వేలకే గ్యాస్‌ కనెక్షన్‌ను ఇస్తున్న విషయాన్ని అధికారులు పేదలకు తెలియజేయాలన్నారు. త్వరలోనే పొగరహిత గ్రామాలుగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్‌ వీరభద్రం, ఆర్‌ఐలు కష్టాల వెంకటేశ్వర్లు, జహేద, వీఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement