కాలి బూడిదైన వరికుప్పలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పంటపొలాల్లో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం నుంచి నాలుగు కిలోమీటర్ల మేర వరికుప్పలు, ఎండు గడ్డి తగలబడుతోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమీప ప్రాంతాల్లోని అగ్నిమాపక యంత్రాలు వచ్చి ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు.